ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు నాగశయనం డిమాండ్ చేశారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దేవాంగులను విస్మరిస్తోందని, నామినేట్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. దేవాంగ కార్పొరేషన్ ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరారు.