ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో మడూరు రోడ్డు క్రాస్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాపాడు మండలం మడూరుకు చెందిన మహబూబ్ షరీఫ్ (50) మృతి చెందాడు. ప్రొద్దుటూరు నుంచి తన స్వగ్రామం మడూరుకు టీవీఎస్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా జమ్మలమడుగు వైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. తలకు గాయాలై మహబూబ్ షరీఫ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.