ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలో 13వ వార్డులోని సున్నపుట్టి వీధిలో ఆ పార్టీ నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.100 చెల్లించి టీడీపీ సభ్వత్వం పొందినట్లయితే బీమా కింద రూ.5లక్షల వర్తిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ ప్రసాద్, ఏసు, భాష, మైఖేల్, రవి పాల్గొన్నారు.