ప్రొద్దుటూరు: రాజ్యాంగం ఒక వరం
రాజ్యాంగం మన హక్కు అని అందులోని అంశాలు వరం లాంటివని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు కో ఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా తెలిపారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మంగళవారం మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి దేవాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెల్లవాళ్ళ నుండి విముక్తి పొంది మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మన దేశానికి ఒక రాజ్యాంగం కల్పించుకుని ప్రజా ప్రభుత్వం అయినది అని వివరించారు.