ప్రొద్దుటూరులో 45 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ప్రొద్దుటూరు పట్టణంలోని అమృత్ నగర్ లో రికార్డులు లేని 45 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున నుంచి పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రొద్దుటూరు రూరల్ సీఐ మద్దిలేటి ఆధ్వర్యంలో అమృత నగర్ లో నాకాబంది నిర్వహించారు.