ప్రొద్దుటూరులో దసరా నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో నిర్వాహకులు నిలువుదోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 25 ఉన్న టికెట్‌ను అమాంతం పెంచేసి రూ. 100కు అమ్ముతున్నారని ఆదివారం డివైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. అధికారులు స్పందించి వేలంపాటలో నిర్ణయించిన ధరలకే టికెట్‌ను ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఎగ్జిబిషన్ వచ్చే వారికి జేబులు చిల్లులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.