కొందరు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఫేక్ ఐడీలతో ప్రొద్దుటూరు వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రొద్దుటూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీఐ గోవింద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.