
ప్రొద్దుటూరు : శివోహం సేవలు అభినందనీయం
శివోహం అన్నప్రసాద సేవా సంఘం సేవలు అభినందనీయమని రెడ్డి సేవా సంఘం, రెడ్ల కల్యాణ మండపం కార్యవర్గసభ్యులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మధ్యాహ్నం శివోహం అన్నప్రసాద సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సంఘం అధ్యక్షుడు శెట్టిపల్లె రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సేవా సంఘం, రెడ్ల కల్యాణ మండపం కార్యవర్గసభ్యుల సహకారంతో అన్నప్రసాద సేవా కార్యక్రమం నిర్వహించామన్నారు.