వేంపల్లి పట్టణంలోని గరుగు వీధిలో మంగళవారం సాయంత్రం ఎంపీటీసీ రాజ్ కుమార్ తన సొంత నిధులతో సిమెంట్ ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ వీధి ప్రజలు సిమెంట్ కాలువపై ర్యాంపు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఆయన వీధిలోని సిమెంట్ రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయించారు. దీంతో ఆ వీధి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీకి అభినందనలు తెలిపారు.