పులివెందుల మండలం వెలమవారిపల్లె గ్రామ సమీపంలో విజయవాడ బెంగళూరు సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు దిలీప్ బిల్కాన్ సంస్థ చేపడుతోంది. నారాయణస్వామి అనే రైతు కౌలుకు మిరప పంట సాగు చేశారు. సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణంతో సాగు చేసిన మిరప పంట దుమ్ము ధూళితో దెబ్బ తింటోందని, దీంతో బుధవారం పంటకు నష్టపరిహారం అందించాలని రోడ్డు పనుల వద్ద వాహనాలకు అడ్డం పడుకుని రైతు నారాయణస్వామి నిరసన తెలిపారు.