జిల్లాలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోరారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.