కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ హరిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని మెప్మా కార్యాలయంలో పీఎం స్వానిధి, పీఎం స్వాభిమాన్ పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. వీధి విక్రయదారులు సమగ్రాభివృద్ధి కోసం స్వానిధి పొందాలంటే ఎనిమిది పథకాలలో తప్పకుండా నమోదు కావాలన్నారు.