పన్నులు సకాలంలో చెల్లించాలి: కమిషనర్

68చూసినవారు
పన్నులు సకాలంలో చెల్లించాలి: కమిషనర్
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ ఆస్తి, నీటి పన్నులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక ఎస్బీఐ కాలనీ సచివాలయం పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్