వేంపల్లి: "అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి"

59చూసినవారు
వేంపల్లి: "అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి"
కేంద్ర మంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఐ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అంబేడ్కర్ సేవా సమితి నాయకులు బ్రహ్మం, రహమతుల్లా తదితరులు పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని, అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్