వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినీ యోగి వేమన విశ్వవిద్యాలయ మహిళల కబడ్డీ జట్టులో ఎంపిక అవ్వడం అభినందనీయమని శనివారం ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మానస వరుసగా రెండోసారి విశ్వవిద్యాలయం మహిళల కబడ్డీ జట్టులో స్థానం సంపాదించిందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు.