నేడు రైల్వేకోడూరులో జాబ్ మేళా

77చూసినవారు
నేడు రైల్వేకోడూరులో జాబ్ మేళా
రైల్వే కోడూరు గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ కార్యాలయం నందు బుధవారం ఉదయం 10 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ పార్థసారథి తెలిపారు. ముత్తూట్ కంపెనీలో యువకులకు కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, డైకిన్ సంస్థలో యువతీ యువకులకు అసెంబ్లింగ్ ఆపరేటర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్