కిశోర బాలికల్లో చైతన్యం తోనే నైపుణ్య ఆంధ్రప్రదేశ్ కు అంకురార్పణ అని చిట్వేలు సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. మంగళవారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలందరికీ అర్థమయ్యేలా వారితోనే చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శరీర భాగాలు అనేవి ఎవరికి వాళ్ళ సొంతమని, వారి శరీర భాగాలను వ్యక్తులు తాకిన అభ్యంతరం వ్యక్తం చేయాలన్నారు.