రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం ఒంటిమిట్ట మండలంలోని వినాయక విగ్రహాల నిమజ్జనం గురించి సీఐ కృష్ణంరాజు నాయక్ తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి సిద్ధవటం పెన్నా నదిలో వినాయకుని విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గురువారం ఒంటిమిట్ట మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాలలో వినాయక నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించామన్నారు.