ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి అరుంధతి వాడలో రెండు వారాల క్రితం త్రాగునీటి మోటార్ చెడిపోయి నీరు లేక ప్రభుత్వ పాఠశాల మోటార్ దగ్గర నీరు తెచ్చుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, గ్రామాల్లో పర్యటించి మంచినీటి వసతి గురించి అధికారులు ఆలోచించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు కనీసం నెలలో ఒకసారైనా మారుమూల గ్రామాల్లో పర్యటించి గ్రామ వసతులను పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.