రెవెన్యూ అధికారులు ప్రజలతో స్నేహంగా ఉండాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం రాజంపేటలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, వీఆర్వో, వీఆర్ఏ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమని అన్నారు. పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాల మేరకు పనిచేయాలని ఆయన కోరారు.