క్రిస్మస్ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో డిసెంబర్ 24 మంగళవారం ఐచ్చిక సెలవుగా జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, అన్ని పాఠశాలల యాజమాన్యాలకు.. విద్యాశాఖ అధికారి పంపారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ సెలవు ఇస్తున్నామని ప్రకటించారు.