జిల్లా ప్రజలు అందరూ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం ఇస్తున్న వారిపై, షేర్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. శుక్రవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ ఎదైనా తప్పుడు సమాచారం వైరల్ అవుతుంటే, ఆయా గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.