రాయచోటి పట్టణం గునికుంట్ల రోడ్డులో రామ్ మోహన్ రెడ్డి అనే టీచర్ ఇంట్లో మంగళవారం పట్టపగలు దొంగతనం జరిగింది. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, తాళాలు తెరిచి ఉండడం గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉన్నట్టు చూశారు. 500 గ్రాముల బంగారం, రూ. 4.75 లక్షలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.