అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని షాప్ నంబర్ 15 రైస్ దుకాణం యజమాని శీను అనే వ్యక్తి మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వృత్తి రీత్యా బియ్యం దుకాణం కలిగి ఉన్న శీను, తలకు గాయాలు ఉండటంతో, ఎవరో అతన్ని చంపి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.