ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రమైన రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.