రాయచోటి: మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలి
రాయచోటి ప్రాంతంలో పేదల కడుపు కొడుతున్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ అనిల్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు మావులూరి విశ్వనాథ్ కోరారు. గురువారం రాయచోటిలో ఆర్టీవో కార్యాలయం వద్ద విశ్వనాథ్ మాట్లాడుతూ అనిల్ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ఆయన అన్నారు. లైసెన్సులు ఆర్సి అన్నీ ఉన్నా అడ్డదిడ్డంగా కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారని ఆరోపించారు.