సుండుపల్లి మండలం సబ్ స్టేషన్ పక్కన ఉన్న పోకల చిన్నప్ప, రెడ్డిచెర్ల అమ్మనీ అమ్మా పట్టా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని గురువారం ఆరోపించారు. ఈ సందర్భంగా పోకల చిన్నప్ప మాట్లాడుతూ 20 ఏళ్ల పట్టా ఉన్న భూమిని వైసీపీకి చెందిన బెల్లం సంజీవరెడ్డి తనదని రౌడీయిజం చలాయిస్తున్నారని తన భూమిలో తాను ఇల్లు కట్టుకుంటుంటే వచ్చి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.