నేటి బాలలే రేపటి నవసమాజ నిర్మాతలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం తెలిపారు. రాయచోటిలో బాలల దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం విశేష కృషి చేయడంతోపాటు స్వాతంత్య్రం అనంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా నెహ్రూ పేరు పొందారని తెలిపారు.