నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్రం కోసం విశేష కృషి చేయడంతో పాటు మొట్టమొదటి దేశ ప్రధానిగా ప్రపంచంలో గొప్ప దేశంగా భారత్ ఎదగడానికి కృషి చేసిన నెహ్రూ మనందరికీ ఆదర్శనీయుడని అన్నారు.