జనవరి ఒకటవ తేదీ సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచర్లలో పర్యటిస్తారని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ఇబ్రహీం ఖాన్ తెలిపారు. బాలురు ఉన్నత పాఠశాలలో బహిరంగ సభ ఉంటుందన్నారు. 400 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారని చెప్పారు. ఎంపీడీవో రాజేంద్ర, మండల హౌసింగ్ ఏఈ యోగానంద, ఏపీఎం బ్రహ్మానంద రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు కోట వెంకటరమణ, కరీముల్లా పాల్గొన్నారు.