కురబలకోట: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

69చూసినవారు
కురబలకోట: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
కురబలకోట మండలం అంగళ్లు విశ్వం కాలేజీ వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరణించిన యువకుడు మదనపల్లి రామారావు కాలనీకి చెందిన ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. ఇదే ప్రమాదంలో త్యాగరాజ కాలనీకి చెందిన శ్రీనివాస్ (29) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని శనివారం ముదివేడు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

సంబంధిత పోస్ట్