AP: సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై మరో ఫిర్యాదు నమోదైంది. అతనిపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, గేదెల ముఖాలకు వీరి ఫోటోలను పెట్టి అవమానించారని ఫిర్యాదులో పేర్కొంది. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.