ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. 'ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా మారుతుంది. 23న తుపానుగా మారే ఛాన్స్ ఉంది. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో 24, 25న ఏపీలోని ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని IMD తెలిపింది.