ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 1.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. భారీ మొత్తంలో నీటి ప్రవాహం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.