ప్రజల తరఫున పోరాటం చేస్తావుంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన మీద, కేటీఆర్ మీద బుల్డోజర్లు ఎక్కిస్తానని, చంపేస్తానని బెదిరిస్తున్నారని అన్నారు. 'నువ్వు చంపుతామన్నా, కేసులు పెడతామన్న భయపడేది లేదు, పేదలకు అన్యాయం జరిగితే ఏ పోరాటానికైనా సిద్ధం' అని హెచ్చరించారు.