విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. వైసీపీ హయాంలో దూకుడుగా ఉండేవారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అయిపోయినా.. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్‌కు కూడా దూరంగానే ఉంటున్నట్టు సమాచారం. ఆయన మరో కీలక పార్టీ వైపు అడుగులు వేయనున్నట్లు సమాచారం. ఆ పార్టీ ఈయనకు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదని సమాచారం.