హిందువుల తొలి పండుగ వినాయకచవితితో మొదలై సంక్రాంతి వరకు పలు పండుగలకు పిండి వంటలకు అధికంగా వంట నూనెలు వినియోగిస్తారు. వచ్చే 3, 4 నెలల్లో దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగ దినాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వంట నూనెల ధరలు గరిష్ట స్థాయికి తీసుకుపోతారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిల్వలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వంట నూనెల ధరలు స్థిరీకరించాలని గృహిణులు కోరుతున్నారు. కూరగాయల ధరలూ అదే దారిలో నడుస్తున్నాయి.