ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇవాళ (శనివారం) దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.