ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబర్ రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు. జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వెలువరించి అనంతరం ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. సంక్షేమ పథకాల అమలుపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రాబోయే నాలుగు నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబోతున్నారో బడ్జెట్‌లో రూపురేఖలు వెల్లడిస్తారు.