బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ ప్రత్యక్షంగా కాకుండా.. ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ-కేబినెెట్ భేటీ విధానాన్ని ఇవాళ్టి నుంచి మళ్లీ నిర్వహించనున్నారు. 2014-19లో ఈ-కేబినెట్ విధానాన్ని నిర్వహించారు. తిరిగి ఇప్పుడు కూడా అదే విధానంలోనే మంత్రులు భేటీ కానున్నారు. పేపర్ లెస్ కేబినెట్‌కు సంబంధించి మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ సైతం ఇచ్చింది.