AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.తెలుపనుంది. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ సాగనుంది. మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.