685 పల్లెలకు తారు రోడ్లు

85చూసినవారు
685 పల్లెలకు తారు రోడ్లు
AP: రాష్ట్రంలోని పల్లెలకు మంచి రోజులు రానున్నాయి. PM గ్రామీణ సడక్‌ యోజన-4లో ఇలాంటి ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందుకోసం ఏపీలో 685 గ్రామాలను ప్రాథమికంగా గుర్తించారు. నాలుగేళ్లలో తారు రోడ్లు నిర్మించి సమీప ప్రధాన రహదారులకు అనుసంధానించనున్నారు. మొదటి దశలో చేపట్టే పనుల కోసం నెలాఖరులోగా డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. ఈ 685 గ్రామాల్లో మొదటి విడతలో 150 గ్రామాల్లో రోడ్లు నిర్మించనున్నారు.

సంబంధిత పోస్ట్