BPSC వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదాన్‌లో పీకే గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. అయితే సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.