గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పెట్టింది. జూలై 28న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.