ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. "40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటావ్.. మరి ఈ మంగళవారం కబుర్లేంటి చంద్రబాబూ? డబ్బులున్నాయ్ అంటావ్.. కానీ సూపర్-6 అమలు చేయలేనంటావ్. కోవిడ్‌తో రెండేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనా.. సాకులు చూపకుండా చిరునవ్వుతో పథకాల్ని అప్పట్లో అమలు చేశారు జగన్. హామీలు నెరవేర్చాలనుకునేవాడు సాకులు వెతకడు.. ఎగ్గొట్టాలనుకునేవాడే ఇలా కాకమ్మ కబుర్లు చెప్తాడు చంద్రబాబు" అంటూ వైసీపీ విమర్శించింది.