ఏపీకి 7 నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: జీవి ఆంజనేయులు

62చూసినవారు
ఏపీకి 7 నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: జీవి ఆంజనేయులు
కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఏపీకి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం పల్నాడు జిల్లాలోని వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. "సీఎం కృషి కారణంగానే పరిశ్రమలు, పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారింది. చంద్రబాబు, లోకేష్ దావోస్‌ పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు మంచి మలుపు. జగన్‌ రాష్ట్రానికి తెచ్చింది శూన్యం. వినుకొండలో 4 బస్‌ షెల్టర్లు నిర్మిస్తాం." అని జీవీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్