టర్కీలో జరిగిన ఓ ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. బోలో ప్రావిన్సులో ఉన్న గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో ఈ ప్రమాదం జరిగింది. 12 అంతస్తులు ఉన్న ఆ హోటల్‌లో తెల్లవారుజామున 3.30 నిమిషాలకు అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. హోటల్ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన ఇద్దరు బాధితులు కూడా మృతిచెందారు. అలాగే, 32 మందికి గాయాలయ్యాయి.