ఆర్మేనియాలో ఏపీ యువకుడు మృతి

65చూసినవారు
ఆర్మేనియాలో ఏపీ యువకుడు మృతి
ఉపాధి కోసం ఆర్మేనియా వెళ్లిన పెద్దదోర్ల మండలం హససాబాద్‌కు చెందిన శివనారాయణ (31) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఫ్రెండ్స్ ఇచ్చిన పానీయం తాగి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అతను చనిపోయాడు. రూ.2 లక్షలు పంపితే మృతదేహం చూపిస్తామని, రూ.10 లక్షలు ఇస్తే ఇండియాకు మృతదేహం పంపుతామని ఫ్రెండ్స్ చెప్పడంపై శివ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ మృతదేహం తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్