జయలలిత బయోపిక్‌.. అందుకే చేయలేదు: నిత్యామేనన్‌

57చూసినవారు
జయలలిత బయోపిక్‌.. అందుకే చేయలేదు: నిత్యామేనన్‌
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకొని నిత్యామేనన్‌ కథానాయికగా యువదర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. దీనిపై నిత్యామేనన్ తాజాగా స్పందించారు. ‘మా సినిమా ప్రకటించిన తర్వాత ‘తలైవి’ చిత్రం, అలాగే ‘క్వీన్‌’ అనే వెబ్‌‌సిరీస్‌ కూడా వచ్చింది. మళ్లీ మేము సినిమా చేస్తే బాగుండదని భావించి దానిని పక్కన పెట్టేశా’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్