డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష

57చూసినవారు
డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిల్క్‌రోడ్ డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడు రాస్‌ విలియంకు క్షమాభిక్షను ప్రసాదించారు. ఇంటర్నెట్‌ వేదికగా విస్తృతస్థాయిలో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారన్న అభియోగాలపై అమెరికా న్యాయస్థానం రాస్‌ విలియంకు 2015లో జీవితఖైదు విధించింది. ఇప్పటికే అతడు 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. తాను అధికారంలోకి వస్తే రాస్ విలియంకు క్షమాభిక్ష పెడతానని గతంలో ట్రంప్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్